![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1028 లో..... రాజు, ఇందు పెళ్లి చేసుకోని వస్తారు. రేఖ షాక్ అవుతుంది. మొన్న ఇందుని కిడ్నాప్ చేసి ఇరవై లక్షలు తీసుకుంది కూడా నేనే అని రాజు చెప్పగానే అందరు షాక్ అవుతారు. అప్పుడు నా దగ్గర వారం రోజులు ఉంచుకున్నాను కదా.. అప్పుడే తను అంటే లవ్ ఏర్పడింది.. నాకు డబ్బు అవసరం ఉందని మీతో పంపాను కానీ నా మనసు తన దగ్గరే ఉందని రాజు అంటాడు. నువ్వు ఇష్టపడ్డావ్ ఒకే కానీ మా ఇందుకి ఇష్టం లేదు కదా అని శేషు అంటాడు. తప్పు జరిగింది కాబట్టి తను ఏం చేస్తుందని రాజు అంటాడు. మా ఇందు తప్పు చేసిందంటే నేను ఒప్పుకోను అని శేషు అంటాడు.
అదొక పౌర్ణమి రోజు ఇందుకి భోజనం తీసుకొని వచ్చాను. అప్పుడే ఆకాశంలో మెరుపులు ఇందు భయపడి నన్ను హగ్ చేసుకుంది. ఇక అప్పుడే తప్పు జరిగిందని రాజు చెప్తాడు. ఇప్పుడు మీకు పెళ్లి జరిగిందని ఎలా నమ్మాలి అని భ్రమరాంబ అడుగుతుంద. నాకు తెలుసు అలా అంటారనే..మా పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయించాను.. త్వరలో మ్యారేజ్ సర్టిఫికెట్ వస్తుంది. ఇంకా మా పెళ్లి వీడియోస్ చూడండి అని రాజు చూపిస్తాడు. అది చూసి నిజం గానే వీళ్ళకి పెళ్లి అయిందని భ్రమరాంబ అంటుంది. మీ పెళ్లి ఒక బొమ్మలాట తాళి తీసేయ్ అని ఇందు మెడలో తాళిని రేఖ తీయబోతుంటే అప్పుడే రాజు తనని ఆపుతాడు. ఇప్పుడు తను నా భార్య.. ఇప్పుడు ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఈ వీడియోస్ మీడియా వాళ్ళకి చూపించి జరిగింది చెప్తానని రేఖని రాజు బ్లాక్ మెయిల్ చేస్తాడు.
ఇందుని తీసుకొని రాజు మళ్ళీ గుమ్మం దగ్గరికి వచ్చి ఇప్పుడు లోపలికి రమ్మంటారా.. మీడియా దగ్గరికి వెళ్ళమంటారా అని రాజు అంటాడు. ఇక చేసేదేమీ లేక లోపలికి రండి అని రేఖ చెప్పేసి కోపంగా లోపలికి వెళ్తుంది. భ్రమరాంబ వాళ్ళకి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది. ఆ తర్వాత నువ్వు అచ్చం మా అబ్బాయిలాగే ఉన్నావని అపర్ణ అంటుంది. మనిషిని పోలిన మనుషులు ఉంటారని రాజు అంటాడు. తరువాయి భాగంలో ఇందుని విడాకులు తీసుకోమని రేఖ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |